మరోసారి నాగ చైతన్య తో కృతి శెట్టి…

34
NC22
- Advertisement -

నాగ చైతన్య, వెంకట్ ప్రభు, శ్రీనివాస చిట్టూరి, శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ ద్విభాషా చిత్రం ఈరోజు హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైంది. వరుస హిట్స్‌తో దూసుకుపోతున్న హీరో నాగ చైతన్య తన 22వ సినిమా కోసం ఏస్ డైరెక్టర్ వెంకట్ ప్రభుతో చేతులు కలిపారు. తెలుగు, తమిళ భాషల్లో రిచ్ ప్రొడక్షన్ వాల్యూస్, ఫస్ట్-క్లాస్ టెక్నికల్ స్టాండర్డ్స్‌తో ఈ చిత్రం గ్రాండ్‌గా రూపుదిద్దుకోనుంది. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాస చిట్టూరి ఈ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌ను నిర్మించనున్నారు. కృతిశెట్టి ఈ చిత్రంలో నాగ చైతన్యకి జోడిగా నటిస్తున్నారు.

నాగ చైతన్య, వెంకట్ ప్రభు, కృతి శెట్టి ఈ ముగ్గురి క్రేజీ కాంబినేషన్ లో తెలుగు-తమిళ భాషల్లో తెరకెక్కనున్న ఈ భారీ ప్రాజెక్ట్ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రానికి దిగ్గజ సంగీత దర్శకులైన తండ్రీ కొడుకులు ఇసైజ్ఞాని ఇళయరాజా, యువన్ శంకర్ రాజా సంగీతం అందించడం మరో విశేషం. వారిద్దరు కలిసి సంగీతం చేస్తున్న మొదటి చిత్రమిది. ఈ కాంబినేషన్‌ లోచార్ట్‌బస్టర్ ఆల్బమ్ ఖచ్చితంగా వస్తుందని చెప్పాలి. ఈ కాంబినేషన్ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది.

లీడ్ పెయిర్‌పై చిత్రీకరించిన ముహూర్తానికి మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను క్లాప్‌ ఇవ్వగా, పాన్ ఇండియా స్టార్ రానా దగ్గుబాటి కెమెరా స్విచాన్ చేసారు. ప్రముఖ నటుడు, దర్శకుడు భారతి రాజా, “ది వారియర్” దర్శకుడు ఎన్ లింగుసామి, బూరుగుపల్లి శివరామ కృష్ణ స్క్రిప్ట్‌ను మేకర్స్‌కి అందజేశారు. ఇంకా పేరు పెట్టని ఈ చిత్రం నాగ చైతన్య యొక్క మొదటి తమిళ చిత్రం కాగా, వెంకట్ ప్రభు ఈ చిత్రంతో తెలుగులోకి అడుగుపెడుతున్నారు. చాలా మంది ప్రముఖ నటీనటులు ఈ చిత్రంలో కనిపించనుండగా, ప్రముఖ సాంకేతిక నిపుణులు ఈ చిత్రం కోసం పని చేస్తున్నారు. అబ్బూరి రవి డైలాగ్స్ అందిస్తున్నారు.

ఈ లాంచ్ ఈవెంట్‌కి చిత్ర యూనిట్ తో పాటు సౌత్ సెలబ్రిటీలు శివకార్తికేయన్, గంగై అమరన్, యువన్ శంకర్ రాజా, ప్రేమ్‌జీ హాజరయ్యారు. జులై నుంచి సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. ఇతర వివరాలు త్వరలో చిత్ర యూనిట్ వెల్లడించనుంది.

తారాగణం: నాగ చైతన్య, కృతి శెట్టి తదితరులు
సాంకేతిక సిబ్బంది:
కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: వెంకట్ ప్రభు
నిర్మాత: శ్రీనివాస చిట్టూరి
బ్యానర్: శ్రీనివాస సిల్వర్ స్క్రీన్
సమర్పణ: పవన్ కుమార్
సంగీతం: ఇళయరాజా, యువన్ శంకర్ రాజా
డైలాగ్స్: అబ్బూరి రవి
పీఆర్వో: వంశీ-శేఖర్
డిజిటల్ మీడియా: విష్ణు తేజ్ పుట్ట

- Advertisement -