- Advertisement -
భాగ్యనగరంలో ఈరోజు భారీ వర్షం కురిసింది. శనివారం రాత్రి నగరంలోని పలు ప్రాంతాలను కురిసిన వాన ఇవాళ కూడా పడింది. జూబ్లీహిల్స్, అమీర్ పేట, పంజాగుట్ట, సరూర్ నగర్, దిల్ సుఖ్ నగర్, బాచుపల్లి, కర్మన్ ఘాట్, నిజాంపేట, కాచిగూడ, బేగంపేట, బోయిన్ పల్లి, నల్లకుంట, బంజారాహిల్స్, కూకట్ పల్లి, గోల్నాక, అంబర్ పేట ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షం పడింది.
రహదారులపై నీళ్లు నిలవగా, కొన్నిచోట్ల నాలాలు పొంగిపోర్లాయి. దాంతో పలు చోట్ల వాహనదారులు ఇబ్బంది పడాల్సి వచ్చింది. కాగా, రుతుపవనాలు, ఉపరితలద్రోణి ప్రభావంతో మరో రెండ్రోజులు తెలంగాణలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇక ఆదివారం నగరంలో పొడి వాతావరణమే ఉంటుందని.. సోమవారం కూడా తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది.
- Advertisement -