సఫారీలతో 5 టీ20ల సిరీస్‌లో భాగంగా నాలుగో టీ20లో గెలిచి సిరీస్ ఆశలను సజీవంగా ఉంచుకుంది భారత్. శుక్రవారం జరిగిన నాలుగో మ్యాచ్‌లో భారత్ 82 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. భారత్ విధించిన 170 పరుగుల లక్ష్య చేదనలో కేవలం 87 పరుగులకే ఆలౌటైంది దక్షిణాఫ్రికా. బవుమా (8 రిటైర్డ్‌హర్ట్) తప్పుకోగా, డికాక్ (14) ,ప్రిటోరియస్ (0) ,క్లాసెన్ (8), మిల్లర్ (9), వాన్ డర్ డసెన్ (20) తక్కువ స్కోరుకే వెనుదిరిగారు. దీంతో దక్షిణాఫ్రికా ఓటమి ఖాయమైంది. భారత బౌలర్లలో ఆవేశ్ ఖాన్(4/18)తో రాణించగా చాహల్‌కు 2 వికెట్లు దక్కాయి.
ఇక అంతకముందు బ్యాటింగ్‌కు దిగిన భారత్ నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ దినేశ్ కార్తీక్ (27 బంతుల్లో 55; 9 ఫోర్లు, 2 సిక్స్‌లు) దూకుడుగా ఆడి అర్ధ సెంచరీ సాధించగా, హార్దిక్ పాండ్యా (31 బంతుల్లో 46; 3 ఫోర్లు, 3 సిక్స్‌లు) రాణించాడు. సిరీస్‌లోని చివరిదైన ఐదో టి20 మ్యాచ్ రేపు బెంగళూరులో జరగనుంది.