అగ్రరాజ్యం అమెరికాలో ఒహియోలోని సిన్సినాటి నైట్‌క్లబ్‌లో ఆదివారం తెల్లవారుజామున ఓ సాయుధుడు చొరబడి విచక్షణారహితంగా కాల్పులకు తెగబడినట్లు అక్కడి మీడియా వెల్లడించింది. ఈ కాల్పుల్లో వ్యక్తి మృతి చెందగా.. 14 మంది గాయపడినట్లు పోలీసులు తెలిపారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలిస్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. డైలీ మిర్రర్ కథనం ప్రకారం ఈ కాల్పుల్లో పలువురు గాయపడినట్లు తెలిపారు. అయితే ఇప్పటివరకు ఎవరినీ అరెస్ట్ చేయలేదని వెల్లడించారు. ఈ కాల్పుల్లో గాయపడిన వారిని స్థానిక ఆసుపత్రులకు తరలించారు. ఫ్లోరిడాలోని ఓర్లాండో నైట్‌క్లబ్‌లో ఓ ఉగ్రవాది 49 మందిని కాల్చి చంపిన ఘటన జరిగిన ఏడాదిలోపే మరోసారి అలాంటి ఘటన చోటు చేసుకుంది.
Medic units transporting while others are still coming in to pickup additional victims pic.twitter.com/FU7GgyvnDN
— Cincinnati News (@CinciNews) March 26, 2017