విజయ్- వంశీ….వారసుడు!

112
vijay
- Advertisement -

దళపతి విజయ్ కధానాయకుడిగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాతలు దిల్ రాజు, శిరీష్, పీవీపీ బ్యానర్‌పై పరమ్ వి పొట్లూరి, పెరల్ వి పొట్లూరి సంయుక్తంగా భారీ స్థాయిలో చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నేషనల్ క్రష్ రష్మికా మందన్న, విజయ్ సరసన కథానాయికగా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.

విజయ్ 66వ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్‌లో భారీతారాగణం కనువిందు చేయనుంది. ఈ చిత్రంలో కీలక పాత్రలలో సీనియర్ స్టార్లు శరత్ కుమార్, ప్రభు, ప్రకాష్ రాజ్, శ్రీకాంత్, జయసుధ కనిపించనున్నారు. వీరితో పాటు.. శామ్, యోగిబాబు, సంగీత, సంయుక్త ఇతర కీలక పాత్రలలో సందడి చేయనున్నారు. ఎస్ థమన్ ఈ చిత్రానికి మ్యూజిక్ అందిస్తున్నారు.

తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతున్న ఈ చిత్రానికి టైటిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఖరారైనట్టు తెలుస్తోంది. ‘వారసుడు’ అనే టైటిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను తెలుగులో ఫిక్స్ చేశారట. అదే అర్థం వచ్చేలా తమిళంలో ‘వారిసు’ అనే పేరును ఫైనల్ చేసినట్టు టాక్.

- Advertisement -