అక్టోబర్‌ 16న గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌..

111
group 1
- Advertisement -

తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ కీలక నిర్ణయం తీసుకుంది. గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ తేదీని ఖరారు చేసింది. అక్టోబర్ 16న ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించాలని నిర్ణయించింది. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత తొలిసారి వివిధ శాఖల్లో 503 గ్రూప్-1 ఉద్యోగాల కోసం టీఎస్​పీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసింది.

మొత్తం 503 పోస్టులకు గానూ.. 3 లక్షల 80 వేల 202 మంది పోటీపడుతున్నారు.మొత్తం 503 పోస్టుల్లో మహిళలకు 225 రిజర్వు అయ్యాయి. వీటికి 1,51,192 మంది దరఖాస్తు చేసుకో, ఒక్కో పోస్టుకు సగటున 672 మంది పోటీ పడుతున్నారు.

అన్ని జిల్లా కేంద్రాల్లో పరీక్షను నిర్వహించాలని కమిషన్‌ నిర్ణయించిందని, పరీక్ష కేంద్రాల వివరాలు, హాల్‌ టికెట్‌ నిర్ణీత సమయంలో టీఎస్‌పీఎస్సీ వైబ్‌సైట్‌ www.tspsc.gov.inలో అప్‌డేట్‌ చేయనున్నట్లు వివరించింది.

- Advertisement -