ప్రభుత్వం రైతులకు అండగా ఉంటుంది- మంత్రి ఎర్రబెల్లి

81
Minister errabelli
- Advertisement -

దేవాదుల రిజర్వాయర్లు, కాలువలకు సంబంధించిన భూ సేకరణపై అధికారులు రైతులతో కలిసి రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పాలకుర్తి క్యాంప్ కార్యాలయంలో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా భూ సేకరణకు ఎదురువుతున్న సమస్యలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆఖరు ఆయకట్టు వరకు నీటిని అందించేందుకు వేగంగా భూ సేకరణను పూర్తిచేయాలని అదేశించారు. సమస్యలు ఉంటే తన దృష్టికి తేవాలని, వాటిని వెంట వెంట పరిష్కరించాలని కోరారు. భూ సేకరణకు సహకరించాలని కోరారు.

ప్రస్తుతం అమలులో ఉన్న చట్టం, పరిధులు, పరిమితులు వారికి అర్థం చేశారు. వారిని భూసేకరణను ఒప్పించారు. అధికారులు చట్టానికి లోబడి రైతుల పట్ల సానుభూతి, సహానుభూతితో వ్యవరించాలని చెప్పారు. ప్రభుత్వం రైతులకు అండగా ఉంటుందని, గ్రామాలు, రాష్ట్రం, ప్రజల అందరి కోసం కొంత త్యాగం తప్పదని, అయితే దేవాదుల కాలువల కోసం భూములు ఇస్తున్న రైతుల సమస్యలు ఏవి ఉన్నా, వాటిని సీఎం దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. ఈ సమావేశంలో జనగామ జిల్లా అడిషనల్ కలెక్టర్ (రెవెన్యూ) భాస్కర్ రావు, ఆర్డీవో, దేవాదుల ప్రాజెక్టు సి ఇ, ఇంజనీర్లు, పలువురు రైతులు పాల్గొన్నారు.

- Advertisement -