జెబి ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ లో గోపీచంద్..

119
gopichand
- Advertisement -

గోపీచంద్ బర్త్ డే సందర్భంగా తన కొత్త చిత్రాన్ని ప్రకటించారు. మాచో హీరో గోపీచంద్ ఆసక్తికరమైన కథలని ఎంచుకుంటున్నారు. డిఫరెంట్ జానర్ సినిమాలను ప్రయత్నిస్తున్నారు. జె భగవాన్, జె పుల్లారావు నిర్మాణంలో ఓ చిత్రం చేయనున్నారు గోపిచంద్.

గోపీచంద్‌తో శంఖం, గౌతమ్ నంద చిత్రాలను రూపొందించిన నిర్మాతలే మూడో సినిమాకి శ్రీకారం చుట్టారని వార్త. జెబి ఎంటర్‌టైన్‌మెంట్స్ (జడ్డు బ్రదర్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్) పేరుతో కొత్త నిర్మాణ సంస్థను ప్రారంభించిన నిర్మాతలు ఈ బ్యానర్ నుండి ప్రొడక్షన్ నంబర్ 2 గోపీచంద్‌ సినిమాని తెరకెక్కించనున్నారు.

ఇంకా టైటిల్ ఖరారు కానీ ఈ సినిమాకు ఓ మాస్ డైరెక్టర్ దర్శకత్వం వహించనున్నారు, ఆ దర్శకుని పేరును త్వరలో చిత్ర యూనిట్ వెల్లడించనున్నారు . ప్రస్తుతం శ్రీవాస్‌ తో ఓ చిత్రం చేస్తున్నారు గోపీచంద్. శ్రీవాస్ తో చేస్తున్న సినిమా పూర్తయిన తర్వాత ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లనుంది. ఈ చిత్రానికి సంబంధించిన ఇతర వివరాలు త్వరలోనే వెల్లడించనున్నారు.

తారాగణం: గోపీచంద్
సాంకేతిక విభాగం:
నిర్మాతలు: జె భగవాన్, జె పుల్లారావు
బ్యానర్: జెబి ఎంటర్‌టైన్‌మెంట్స్
పీఆర్వో: వంశీ-శేఖర్

- Advertisement -