గత ప్రభుత్వాలలో ఎడారిగా మారిన తెలంగాణ నేడు పచ్చని కోనసీమగా విలసిల్లుతుందన్నారు మంత్రి మల్లారెడ్డి. జవహర్‌నగర్ కార్పొరేషన్‌లోని పలు డివిజన్లలో అభివృద్ధి పనులను ప్రారంభించారు. అభివృద్ధిలో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం ప్రథమ స్థానంలో నిలిచిందంటే అందుకు సీఎం కేసీఆర్ ముందుచూపేనన్నారు.
గతంలో జవహర్‌నగర్‌లో చెత్త డంపింగ్‌యార్డ్ దుర్వాసనతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. టీఆర్ఎస్ ప్రభుత్వంలో చెత్త డంపింగ్ యార్డ్‌కు కొత్త టెక్నాలాజీతో క్యాంపింగ్ చేసి వాసన రాకుండా చేశామన్నారు. కార్పొరేషన్‌ను అందమైన నగరంగా తీర్చిదుద్దుతున్నామని హామీనిచ్చారు.
దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా సీఎం కేసీఆర్ ప్రతిష్టత్మకంగా ప్రవేశపెట్టిన పల్లె, పట్టణ ప్రగతితో రాష్ట్రంలోని గ్రామాలు, పట్టణాలు కొత్త హంగలను సంతరించుకుంటున్నాయని అన్నారు. రాష్ట్రంలో పచ్చని వాతావరణం నెలకొందంటే సీఎం కేసీఆర్‌కే ఈ ఘనత దక్కుతుందన్నారు.