ఇంతియాజ్ వ్యాఖ్యలు వ్యక్తిగతం…పార్టీకి సంబంధంలేదు:ఓవైసీ

67
owaisi
- Advertisement -

మహమ్మద్ ప్రవక్తపై బీజేపీ నేత నుపుర్ శర్మ చేసిన వ్యాఖ్యలపై ఎంఐఎం ఎంపీ ఇంతియాజ్ తీవ్రంగా స్పందించారు. ఆమెను ఉరి తీయాలని…ఆమెను ఇలాగే వదిలేస్తే అలాంటి ఘటనలు జరగడాన్ని ఆపలేమని వ్యాఖ్యానించగా దీనిని ఖండించారు ఆ పార్టీ చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ.

నుపుర్ శర్మను ఉరితీయాలన్న అభిప్రాయంతో తమ పార్టీకి సంబంధం లేదని….దేశంలోని చట్టాల ప్రకారమే నుపుర్ శర్మను అరెస్టు చేయాలి. చట్ట ప్రకారమే ఆమెను శిక్షించాలి. ఈ విషయంలో ఇదే మా పార్టీ వైఖరి. పార్టీలోని నేతలు అందరూ దీన్ని అంగీకరించాలని తేల్చిచెప్పారు.

మరోవైపు ఇంతియాజ్ వ్యాఖ్యలను శివసేన కూడా ఖండించింది. ఆ పార్టీ నాయకురాలు, ఎంపీ ప్రియాంకా చతుర్వేది మాట్లాడుతూ …ఇంతియాజ్ వ్యాఖ్యలు సిగ్గుచేటు. వీటిని ఖండించాలి. బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న వ్యక్తిగా ఇలాంటి సందర్భంలో రెచ్చగొట్టే బదులు శాంతియుతంగా, సంయమనంతో ఉండాలని సూచించారు.

- Advertisement -