ఇరాన్ మంత్రితో ప్రధాని మోడీ భేటీ

61
modi pm
- Advertisement -

ఇరాన్ మంత్రి హుస్సేన్ అమీర్ అబ్దుల్లాహేన్‌తో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ భేటీ అయ్యారు. భారత్‌తో ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంపై ఇరుపక్షాల నేతల మధ్య చర్చలు జరిగాయి. కొందరు వ్యక్తులు మహమ్మద్ ప్రవక్త పట్ల వ్యతిరేకంగా చేసిన కామెంట్లతో ఇబ్బందికర పరిస్థితి వచ్చిందని.. భారత్ మహమ్మద్ ప్రవక్తను గౌరవిస్తుందని ఈ సందర్భంగా తెలిపారు అజిత్ దోదల్.

ఈ అంశం పట్ల మిగిలిన వారికి పాఠంలా ఉండేలా చర్యలు తీసుకుంటామని భారత్ హామీ ఇచ్చినట్టు ఇరాన్ విదేశాంగ శాఖ ప్రకటించింది. మతాలను పరస్పరం గౌరవించుకోవాలని, విభజనవాద ప్రకటనలను నివారించాలనే అంగీకారానికి వచ్చినట్టు అబ్దుల్లాహేన్ తెలిపారు. చర్చల అనంతరం భారత్‌తో ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి ఇరాన్ ఆసక్తి చూపించింది.

- Advertisement -