- Advertisement -
ప్రముఖ రంగస్థల నటుడు, కేంద్ర సంగీత నాటక అకాడమీ అవార్డు గ్రహీత, పద్మశ్రీ సురభి (రేకందార్) నాగేశ్వర రావు మరణం పట్ల ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు సంతాపం ప్రకటించారు. సంగీత, నాటకరంగానికి శతాబ్ధానికి పైగా సురభి సంస్థ అందిస్తున్న సేవలు చారిత్రాత్మకమైనవని సీఎం కొనియాడారు. తెలుగు వారికి సుపరిచితమైన సురభి సంస్థ వారసుడిగా, నాటక రంగానికి నాగేశ్వర్ రావు చేసిన సాంస్కృతిక సేవ గొప్పదన్నారు. నాగేశ్వర్ రావు మరణం సురభి సంస్థకే కాకుండా, యావత్తు నాటకరంగానికి తీరని లోటని అన్నారు. వారి కుటుంబ సభ్యులకు సీఎం తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు సీఎం కేసీఆర్.
- Advertisement -