- Advertisement -
కోలీవుడ్ బ్యూటిఫుల్ కపుల్ నయనతార – విఘ్నేశ్ శివన్ మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. ఇవాళ ఉదయం 2.22 గంటలకు నయన్-విఘ్నేశ్‌ల వివాహం అంగరంగ వైభవంగా మహాబలిపురంలో జరిగింది. సూపర్ స్టార్ రజనీకాంత్, బాలీవుడ్ బాద్‌షా షారుక్ ఖాన్‌లు పెళ్లికి హాజరై వధూవరులను ఆశీర్వదించారు.కుటుంబ సభ్యులతో పాటు పలువురు ప్రముఖులు కూడా హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.
పెళ్లికి కొద్ది క్షణాల ముందు విఘ్నేశ్ శివన్ నయన్‌పై ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు. తను వధువుగా ముస్తాబై వివాహ వేదికపై నడుచుకుంటూ వస్తుంటే చూడాలని ఆతృతగా ఎదురు చూస్తున్నానంటూ కాబోయో భార్య గురించి ఆసక్తికర పోస్ట్ షేర్ చేసి భావోద్వేగానికి లోనయ్యాడు విఘ్నేశ్.
- Advertisement -