ఉపరాష్ట్రపతి పర్యటన..ట్రాఫిక్ ఆంక్షలు

63
vp
- Advertisement -

ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఇవాళ హైదరాబాద్‌లో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించనున్నారు. ఉదయం 9.35 గంటలకు బేగంపేట్‌ ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. అక్కడి నుంచి జూబ్లీహిల్స్‌ రోడ్డు నం.29లోని ఆయన నివాసానికి చేరుకుంటారు.

ఈ నేపథ్యంలో పీఎన్‌టీ ఫ్లైఓవర్‌, శ్యామ్‌లాల్‌ బిల్డింగ్‌, హెచ్‌పీఎస్‌ బేగంపేట్‌, బేగంపేట్‌ ఫ్లైఓవర్‌, పంజాగుట్ట ఫ్లైఓవర్‌, జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్టు, జూబ్లీహిల్స్‌ రోడ్డు నం. 29 మార్గంలో ట్రాఫిక్‌ నిలిపివేత, మళ్లింపులు ఉంటాయని చెప్పారు. దీంతో ఆ సమయంలో వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలు ఎంచుకోవాలని అధికారులు సూచించారు.

- Advertisement -