విరాటపర్వం రివ్యూ ఇచ్చేసిన నిఖిల్!

64
rana
- Advertisement -

పాన్ ఇండియా స్టార్ రానా దగ్గుబాటి, సాయిప‌ల్లవి జంట‌గా వేణు ఊడుగుల ద‌ర్శక‌త్వంలో రూపొందిన ప్రతిష్టాత్మక చిత్రం ‘విరాట‌ప‌ర్వం’. డి. సురేష్ బాబు స‌మ‌ర్పణ ‌లో ఎస్‌.ఎల్‌.వి. సినిమాస్ ప‌తాకంపై సుధాక‌ర్ చెరుకూరి నిర్మించారు. ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ చిత్రంపై ఇటీవల విడుదలైన ట్రైలర్ మరింత అంచనాలని పెంచింది. జూన్ 17న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా థియేటర్లోకి రానుండగా అప్పుడే రివ్యూ ఇచ్చేశాడు హీరో నిఖిల్.

విరాటపర్వం స్పెషల్ స్క్రీనింగ్ చూసిన నిఖిల్ ఈ సినిమాపై ప్రశంసల వర్షం కురిపించాడు. ఇలాంటి సినిమాను అందించిన దర్శకుడు వేణు ఊడుగుల, నిర్మాత సుధాకర్ చెరుకూరిలకు హ్యాట్సాఫ్ చెప్పాడు. విరాటపర్వం చిత్రం ఓ ఎపిక్ లవ్ స్టోరీ అని.. ఈ సినిమా చూసి తాను ఆశ్చర్యానికి లోనయ్యానని.. సాయి పల్లవి తన కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చిందని.. రానా దగ్గుబాటి తన పాత్రలో అదరగొట్టాడని.. ఇలాంటి సినిమాలను అస్సలు మిస్ కావద్దని నిఖిల్ చెప్పుకొచ్చాడు.

- Advertisement -