ద‌ళిత బంధుతో స‌మ‌గ్రాభివృద్ధి: త‌ల‌సాని

40
thalasani
- Advertisement -

ద‌ళిత బంధు తో ఆ సామాజిక‌వ‌ర్గం జీవితాల్లో మార్పులు వ‌స్తాయ‌న్నారు మంత్రి త‌ల‌సాని శ్రీ‌నివాస్ యాద‌వ్. హైద‌రాబాద్ వెస్ట్‌ మారేడ్‌పల్లిలో దళితబంధు లబ్ధిదారులకు వాహనాలు పంపిణీ చేశారు. అనంతరం మాట్లాడుతూ.. ఒక్కో లబ్ధిదారుడికి రూ.10 లక్షల ఆర్థిక సహాయం అందించే ఇలాంటి కార్యక్రమం దేశంలో ఎక్కడా అమలులో లేదని చెప్పారు.

ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక సహాయాన్ని లబ్ధిదారులు సద్వినియోగం చేసుకుని అభివృద్ధి సాధించాలని సూచించారు. గతంలో ఎవరైనా దళితుల అభివృద్ధి గురించి ఆలోచించారా? అని ప్రశ్నించారు. దళితుల సమగ్రాభివృద్ధి కోసమే ప్రభుత్వం దళితబంధు పథకాన్ని ప్రవేశపెట్టిందని …ఆర్ధికంగా ఎంతో వెనుకబడిన దళితులు అభివృద్ధి సాధించాలనేది సీఎం కేసీఆర్‌ ఆలోచన అని చెప్పారు.

ప్రధాని మోదీ.. హైదరాబాద్‌ కార్పొరేటర్లను ఢిల్లీకి పిలిచి ఒట్టి చేతులతో పంపారని, నగర అభివృద్ధి కోసం నిధులిస్తే ప్రజలకు మేలు జరిగేదని విమర్శించారు.

- Advertisement -