- Advertisement -
వడ్డీ రేట్లను పెంచుతూ ఆర్బీఐ కీలక నిర్ణయం తీసుకుంది. రెపో రేటును పెంచడంతో బ్యాంకు వడ్డీలు ఇప్పుడు మరింత భారం కానున్నాయి. పెంచిన వడ్డీ రేట్లను తక్షణం అమలు చేయనున్నట్లు గవర్నర్ శక్తికాంత్ దాస్ తెలిపారు.
రెపో రేటును 50 బేసిస్ పాయింట్లు పెంచేందుకు ద్రవ్యపరపతి సంఘం ఏకగ్రీవంగా అంగీకరించినట్లు ఆయన వెల్లడించారు. 50 బీపీఎస్ పెంపుతో రెపో రేటు 4.90 శాతానికి చేరుకుంది. డిజిటల్ పేమెంట్ వ్యవస్థ మరింత దూకుడుగా మారాలని, దీని కోసం యూపీఐ ఫ్లాట్‌ఫామ్‌తో క్రెడిట్ కార్డులను జోడించే ప్రతిపాదన ఉన్నట్లు ఆర్బీఐ గవర్నర్ వెల్లడించారు.
రెపో రేటును పెంచడం వల్ల వడ్డీ రేట్లు కూడా పెరగనున్నాయి. దీంతో కార్లు, పర్సనల్, హోం లోన్స్‌పై వడ్డీ కూడా పెరగనున్నది. దీని వల్ల ఈఎంఐలు కూడా పెరుగుతాయి.
- Advertisement -