- Advertisement -
ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాల సంఖ్య పెంచేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలనిస్తున్నాయి. ఇప్పటికే కేసీఆర్ కిట్, ప్రభుత్వ ఆస్పత్రుల్లో డెలివరీ చేయించుకునే వారికి నగదు ప్రోత్సాహం కూడా ఇస్తుండగా తాజాగా ప్రభుత్వం మరో నిర్ణయాన్ని తీసుకుంది.
ఇకపై ప్రభుత్వ ఆస్పత్రుల్లో నార్మల్ డెలివరీ చేసే డాక్టర్లకు రూ. 3 వేల పారితోషికాన్ని ప్రకటించారు మంత్రి హరీశ్ రావు. ఆశా వర్కర్లు, ఏఎన్ఎం, స్టాఫ్ నర్సులు నార్మల్ డెలివరీలను ప్రోత్ససహించాలని ప్రజారోగ్యం కోసం మార్పు తెద్దామని తెలిపారు.
నార్మల్ డెలివరీలు ఎక్కువగా పెరగాలని ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రికి తేడా ఏంటో తెలియాలన్నారు.
- Advertisement -