బాల్కొండలో కాంగ్రెస్‌కు షాక్‌.. కారెక్కిన సీనియర్‌ నేతలు..

80
- Advertisement -

ముఖ్యమంత్రి కేసిఆర్ జనరంజక పాలనకు ఆకర్షితులై బాల్కొండ నియోజకవర్గం మెండోర మండల కేంద్రానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కొప్పెల సాయిరెడ్డి,ఆయన అనుచరులు 20 మంది రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సమక్షంలో సోమవారం హైదరాబాద్‌లో టిఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారికి మంత్రి గులాబీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.

కేసీఆర్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలకు ప్రభావితులై ,అభివృద్ది వైపే మేము ఉంటామని నిర్ణయం తీసుకుని టిఆర్ఎస్ పార్టీలో చేరడం శుభ పరిణామం అని మంత్రి అన్నారు.ఇక నుండి మీరు టిఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులని మీకు అన్ని విధాల పార్టీ అండగా ఉంటుందని బరోసానిచ్చారు. బాల్కొండ నియోజకవర్గంలో వందల కోట్లతో జరిగిన అభివృద్ధి మీ కండ్ల ముందు కనిపిస్తుందని అన్నారు.100 కోట్లతో చెక్ డ్యాంలు నిర్మించి ఏళ్లతరబడి ఉన్న సాగునీటి గోసను తీర్చుకున్నామన్నారు. ఎస్సారెస్పీ పునరుజ్జీవ పథకం ద్వారా కాకతీయ,వరద కాలువలు మండు వేసవిలో కూడా నేడు నిండు కుండల ఉన్నాయని గుర్తు చేశారు. ప్రతి పల్లెను అన్ని విధాలా అభివృద్ధి చేసుకుంటున్నామని దానికే మీరే సాక్ష్యమన్నారు.

దేశమంతా కరెంట్ కటకట ఉన్నా.. ముఖ్యమంత్రి కేసిఆర్ ముందు చూపు వల్ల నేడు తెలంగాణలో విద్యుత్ కోతలు లేవని అన్నారు.రైతులు,పేదలు రెండు కళ్లుగా సంక్షేమ పాలన అందిస్తున్న దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రం తెలంగాణ అని మంత్రి పునరుద్ఘాటించారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్,డైనమిక్ మంత్రి కెటిఆర్ చొరవతో నేడు రాష్ట్రంలో విదేశీ కంపెనీలు లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టి,లక్షల మంది తెలంగాణ యువతకు ఉద్యోగాలు కల్పిస్తున్నారని తెలిపారు.పట్టణాల్లో,పల్లెల్లో సమాంతరంగా సమగ్రాభివృద్ధి జరుగుతుందన్నారు.

ఈ కార్యక్రమంలో మెండోర సర్పంచ్ మచ్చర్ల రాజారెడ్డి,టిఆర్ఎస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి నవీన్ గౌడ్,మండల పార్టీ ఉపాధ్యక్షుడు బడాల గంగారెడ్డి,సొసైటి చైర్మన్ మచ్చర్ల రాజారెడ్డి,టౌన్ ప్రెసిడెంట్ మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -