సర్కారు వారి పాట నుండి ‘మురారి వా’ వచ్చేసింది.. వీడియో

400
Murari Vaa
- Advertisement -

సూపర్‌ స్టార్ మహేష్ బాబు ప్రతిష్టాత్మక చిత్రం ‘సర్కారు వారి పాట’. మైత్రీ మూవీ మేకర్స్, జీఏంబీ ఎంటర్టైన్మెంట్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్లపై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్, రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం మే 12 ప్రేక్షకుల ముందుకు వచ్చి ఘన విజయం సాధించింది. అన్నివర్గాల ప్రేక్షకులు అలరించి ప్రపంచవ్యాప్తంగా రిలీజైన నాలుగు రోజుల్లో 153+ కోట్లు వసూళు చేసి బాక్సాఫీసు వద్ద ప్రభంజనం సృష్టించింది. తమన్ స్వరపరిచిన బాణీలు ఈ సినిమా విజయంలో కీలకమైన పాత్రను పోషించాయి. ముఖ్యంగా ‘కళావతి’ .. ‘మ మ మహేశా’ సాంగ్స్ ఒక రేంజ్ లో దూసుకుపోయాయి.

అయితే, ఈ సినిమా కోసం చిత్రీకరించిన ‘మురారివా’ అనే సాంగ్ ను కొన్ని కారణాల వలన సినిమాలో ఉపయోగించలేదు. సినిమా విడుదల తరువాత కొన్ని రోజులకు ఈ పాటను యాడ్ చేశారు. తాజాగా ఆ పాటను యూ ట్యూబ్‌లో విడుదల చేశారు మేకర్స్‌. ‘మురారివా .. మురారివా .. మురళీ వాయిస్తూ ముడేస్తివా’ అంటూ ఈ పాట సాగుతోంది. మహేష్‌ బాబు – కీర్తి సురేష్‌ పై బ్యూటిఫుల్ సెట్లో ఈ పాటను కలర్ఫుల్ గా చిత్రీకరించారు. సాహిత్యం, ట్యూన్ పరంగా పాట ఆకట్టుకుంటోంది.

- Advertisement -