- Advertisement -
బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావుపై కేసు నమోదైంది. జూబ్లీహిల్స్ అమ్నీషియా పబ్ సామూహిక లైంగిక దాడి ఘటనలో బాలిక ఫోటోలు, వీడియోలు ఆయన బయటపెట్టడంతో అబిడ్స్ పోలీసు స్టేషన్లో కేసు నమోదు అయింది. ఐపీసీ సెక్షన్ 228ఏ కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.
అఘాయిత్యానికి గురైన బాధితుల వివరాలు బయటకు రావొద్దని సుప్రీం కోర్టు ఆదేశాలున్నా, కారులోని వీడియోలను ఫేస్బుక్లో పోస్టు చేయటంతో పోలీసులు కేసు నమోదు చేశారు.
ఇక ఈ కేసులో ఎమ్మెల్యే కొడుకును కూడా ఈ కేసులో నిందితుడిగా చేర్చే అవకాశం ఉంది. ఇప్పటికే నలుగురు నిందితులను అరెస్టు చేసిన పోలీసులు వారిని కస్టడీలోకి తీసుకొని పూర్తి వివరాలను రాబట్టేందుకు సిద్ధమవుతున్నారు.
- Advertisement -