- Advertisement -
ఈ నెల చివరి నుండి ప్రారంభం కానున్న ఆషాడ బోనాల ఉత్సవాల నిర్వహణ పై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అధ్యక్షత న మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రం (MCHRD) లో ఇవాళ సమావేశం జరగనుంది.
ఉదయం 10.30 గంటలకు సమావేశం జరుగుతుంది. ఈ సమావేశానికి హోంమంత్రి మహమూద్ అలీ, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి, మేయర్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత, GHMC పరిధిలోని రాజ్యసభ, పార్లమెంట్ సభ్యులు, MLC లు, MLA లు, బోనాల ఉత్సవాల నిర్వహణ కమిటీ సభ్యులు, హైదరాబాద్, రాచకొండ, సైబరాబాద్ కమిషనరేట్ ల పోలీస్ కమిషనర్ లు, దేవాదాయ, రెవెన్యూ, పోలీసు, వాటర్ వర్క్స్, ఎలెక్ట్రికల్, కల్చరల్ తదితర శాఖల అధికారులు పాల్గొంటారు.
- Advertisement -