సేవా కార్యక్రమాల్లో పాల్గొనండి: హరీష్‌ పిలుపు

99
harishrao
- Advertisement -

ఇవాళ రాష్ట్ర ఆర్థిక‌, వైద్యారోగ్య శాఖ మంత్రి హ‌రీశ్‌రావు బర్త్ డే. ఈ సందర్భంగ అభిమానుల‌కు సందేశం ఇచ్చారు. నా పుట్టిన రోజు (జూన్ 3)న శుభాకాంక్షలు చెప్పడానికి, నన్ను ఆశీర్వదించడానికి వస్తామంటూ ఫోన్లు చేస్తూ, సందేశాలు పంపుతున్న‌ ప్రతీ ఒక్కరికి పేరుపేరునా కృతజ్ఙతలు కానీ మీ అందరిని నిరాశపరుస్తున్నందుకు మన్నించాలని కోరారు.

ఇవాళ తాను హైదరాబాద్‌లో కానీ, సిద్దిపేటలో కానీ ఉండడం లేదని…..ముందే నిర్ణయించుకున్న వ్యక్తిగత కార్యక్రమాల్లో భాగంగా దూరంగా ఉండవలసి వస్తోందని చెప్పారు. నా పట్ల మీకున్న‌ ప్రేమను సమాజానికి ఉపయోగపడే సేవా కార్యక్రమాల ద్వారా చాటాలని కోరుకుంతున్నానని తెలిపిన హరీష్…. మీ అభిమానానికి మరోసారి తల వంచి నమస్కరిస్తున్నన్నాను. మీరు చూపించే ఆదరాభిమానాలు, ప్రేమను గుండెల్లో పెట్టుకుంటాను అని తెలిపారు.

- Advertisement -