క్రాస్ పిక్చర్స్ మరియు క్రాస్ టెలివిజన్ ఇండియా యజమానులు పుష్పక విమాన అనే కన్నడ సినిమా నిర్మాతలపై కేసు దాఖలు చేశారు. ఈ సినిమా కొరియా చిత్రమైన మిరాకిల్ ఇన్ సెల్ నెం.7 ఆధారంగా తెరకెక్కింది అని చెప్పిన పుష్పక విమానం యూనిట్ మీద వారు కేసు నమోదు చేశారు. సూపర్‌హిట్ కొరియన్ సినిమా ఇండియన్ రీమేక్ హక్కులను ఉల్లఘించారంటూ, విఖ్యాత్ చిత్ర ప్రొడక్షన్స్, పవన్ వడేయార్ ఫిల్మ్ ఫ్యాక్టరీ మరియు సినిమాకు సంబంధించిన వారిపై యజమానులు బాంబే హైకోర్టులో కేసు వేశారు.
ఈ విషయంపై, దర్శకుడు ఎస్. రవీంద్రనాథ్ స్పందిస్తూ, పుష్పక విమాన అనే సినిమాను కేవలం మిరాకిల్ ఇన్ సెల్ నెం.7 ఆధారితంగానే తెరకెక్కించడం లేదని, సినిమా కథ మొత్తం విమానం చుట్టూనే తిరుగుతూ ఉండటంతో, ఈ సినిమాను లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్, ఐయామ్ శామ్, మిరాకిల్ ఇన్ సెల్ నెం.7 మరియు పర్ష్యూట్ ఆఫ్ హ్యాపీనెస్ అనే నాలుగు సినిమాలను ఆదర్శంగా తీసుకుని తెరకెక్కించామని, దానికి సినిమా టైటిల్ ముందు థ్యాంక్స్ కార్డ్ కూడా వేశామని చెప్తున్నారు.
కన్నడ నటుడు రమేష్ అరవింద్ నటించిన 100 వ చిత్రం పుష్పక విమానలో బాలనటి యువినా పార్వతి కూడా నటించింది.ఈ సందర్భంగా, ఆ సంస్థ ప్రతినిధి మాట్లాడుతూ, 2004లో ప్రారంభమైన క్రాస్ పిక్చర్స్, ప్రేక్షకుల ఆదరాభిమానాలు పొందుతూ, సియోల్, లాస్ ఏంజెల్స్ మరియు ముంబైలలో బ్రాంచ్ లు కలిగి, ప్రపంచంలోని అన్ని ప్రాంతాల నుంచి, కొత్త కథలను వివిధ మార్గాల్లో తెరకెక్కించే సంప్థగా క్రాస్ పిక్చర్స్ పేరు తెచ్చుకుంది. అతి త్వరలోనే మిరాకిల్ ఇన్ సెల్ నెం.7 ను తెలుగు, తమిళ, హిందీ భాషల్లో స్టార్ హీరోలతో తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నాం. త్వరలోనే దీనికి సంబంధించిన వివరాలను తెలియపరుస్తాం. మిరాకిల్ ఇన్ సెల్ నెం.7 కు సంబంధించిన సన్నివేశాలను వాడుకున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.