బ్యాంక్ కస్టమర్లకు బ్యాడ్ న్యూస్. ఇవాల్టీ నుండి పలు బ్యాంకుల ఛార్జీలు పెరగనున్నాయి. ఎస్బీఐ బ్యాంకు హోంలోన్ వడ్డీరేట్ల నుంచి థర్డ్ పార్టీ ఇన్సురెన్స్ ప్రీమియం లోన్ల వరకు అన్నింటిల్లో వినియోగదారులపై భారం పడనుంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గృహ రుణ ఎక్స్టర్నల్ బెంచ్మార్క్ లెండింగ్ రేటు (EBLR) 40 బేసిస్ పాయింట్లు పెంచేసింది. గృహ రుణాలపై వడ్డీ రేటు 7.05 శాతానికి పెరగనుంది.
వాహనాల థర్డ్ పార్టీ మోటార్ బీమా ప్రీమియం కూడా భారీగా పెరగనుంది. టూవీలర్ వాహనాల్లో ఇంజిన్ సామర్థ్యం 75cc కన్నా తక్కువ ఉంటే ఆ వాహనాలపై బీమా ప్రీమియం రూ.538గా ఉండనుంది. 75cc పైన 150cc లోపు వాహనాలపై రూ.714గా ఉండనుంది.
ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టమ్ సర్వీస్ ఛార్జీలను పెంచేసింది. AePS లావాదేవీలపై ఈ ఛార్జీలను వినియోగదారులు చెల్లించాల్సి ఉంటుంది.