- Advertisement -
ఇటీవల బేగంబజార్‌లో నీరజ్ పవార్ దారుణ హత్యకు గురైయ్యాడు. ఈ హత్యకు కారకులైన దోషులను కఠినంగా శిక్షించాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ నగర పోలీస్ కమిషనర్ వీసీ ఆనంద్‌ను ఆదేశించారు. సోమవారం మంత్రి శ్రీనివాస్ యాదవ్‌ను వెస్ట్ మారేడ్ పల్లిలోని తన నివాసంలో హత్యకు గురైన నీరజ్ పవార్ భార్య సంజన, తల్లి నిషా పవార్ మంత్రిని కలిశారు. నీరజ్ హత్యకు కారకులైన దోషులను కఠినంగా శిక్షించాలని వారు మంత్రిని కోరారు.
వారికి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుంది అని మంత్రి హామి ఇచ్చారు. నేరానికి పాల్పడిన వారు ఎంతటి వారైనా ప్రభ్యత్వం వదిలిపెట్టదని, కఠిన చర్యలు తప్పవని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు. ప్రభుత్వం ఇలాంటి సంఘటనలను ఉపేక్షించబోదని చెప్పారు. నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్‌తో ఫోన్‌లో మాట్లాడి నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
- Advertisement -