- Advertisement -
మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లాలో నిర్వహించిన రెడ్ల సింహగర్జన సభలో మంత్రి మల్లారెడ్డి ప్రసంగాన్ని కొంతమంది అడ్డుకున్న సంగతి తెలిసిందే. దీంతో మల్లారెడ్డి తన ప్రసంగాన్ని నిలిపివేసి అక్కడి నుండి వెళ్లేందుకు ప్రయత్నించగా కాన్వాయ్‌పై దాడి చేసేందుకు ప్రయత్నించారు.
ఈ నేపథ్యంలో తనపై జరిగిన దాడిపై స్పందించారు మంత్రి మల్లారెడ్డి. ఈ దాడి వెనక తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ రేవంత్‌రెడ్డి కుట్ర ఉందని ఆరోపించారు. రేవంత్‌రెడ్డి చేస్తున్న ప్రజా వ్యతిరేక చర్యలను ప్రశ్నిస్తున్నానన్న దుగ్ధతోనే అనుచరుల ద్వారా దాడిచేయించాడని పేర్కొన్నారు.
తాను ఇలాంటి వాటికి భయపడే రకం కాదని…కరోనా కారణంగా రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు ఆలస్యమైందన్నారు. ఇదే విషయాన్ని తాను చెబుతుండగా తనకు వ్యతిరేకంగా నినాదాలు చేసి దాడి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.
- Advertisement -