ఐపీఎల్ విజేతగా గుజరాత్…

60
- Advertisement -

ఐపీఎల్ 15వ సీజన్ విజేతగా గుజరాత్ నిలిచింది. లీగ్ లోకి అడుగుపెట్టిన తొలి సీజన్‌లోనే టైటిల్ గెలిచిన తొలిజట్టుగా రికార్డు సృష్టించింది. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరిగిన ఫైనల్ మ్యాచ్ లో రాజస్తాన్ రాయల్స్ పై 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది గుజరాత్.

131 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి గుజరాత్.. మరో 11 బంతులు మిగిలి ఉండగానే 13.1 ఓవర్లలో కేవలం 3వికెట్లు మాత్రమే కొల్పోయి టార్గెట్‌ను చేధించింది. ఓపెనర్ శుభ్ మన్ గిల్ 45 పరుగులు, పాండ్యా 34 పరుగులు , మిల్లర్ 32 పరుగులు చేశాడు.

ఇక అంతకముందు బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ నిర్ణీత ఓవర్లలో 130 పరుగులు చేసింది. టాప్ ఆర్డర్ పూర్తిగా విఫలం కావడం, హార్థిక్ పాండ్యా అద్భుత బౌలింగ్‌కు కీలక మ్యాచ్‌లో రాజస్థాన్ ఢీలా పడి ఓటమి పాలైంది.

- Advertisement -