‘అఖండ’తో ఇండస్ట్రీ హిట్ ని అందుకున్న నటసింహ నందమూరి బాలకృష్ణ, క్రాక్ సినిమాతో మాస్ విజయాన్ని అందుకున్న స్టార్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని.. ఇంతకంటే బిగ్గెస్ట్ హిట్ అందించడానికి కలసి పని చేస్తున్నారు. #NBK107 అనే వర్కింగ్ టైటిల్ తో టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో శ్రుతి హాసన్ కథానాయికగా నటిస్తోంది.
నేడు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ, మహానాయకుడు నందమూరి తారక రామారావు 100వ జయంతిని పురస్కరించుకుని ఆయనకి ఘన నివాళులు అర్పిస్తూ చిత్రం నుండి సరికొత్త మాస్ పోస్టర్‌ను విడుదల చేశారు నిర్మాతలు. టెంపుల్ బ్యాక్డ్రాప్ లో చేతిలో రక్తం చిందిన కట్టి పట్టుకొని, పిడికిలి బిగిస్తూ బాలయ్య ఉగ్రరూపంలో కనిపిస్తున్న ఈ పోస్టర్ ఒక్కసారిగా అంచనాలు పెంచేసింది.
NBK107 లో భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతుంది. ఇప్పుడు విడుదలైన మాస్ పోస్టర్ కూడా అదే సూచిస్తుంది. తన ఆల్-టైమ్ ఫేవరెట్ స్టార్ బాలకృష్ణతో సినిమా చేయడం గోపీచంద్ మలినేని కల. ఈ సినిమాతో గోపీచంద్ మలినేని కల నిజమైయింది. ఇంతకు ముందెన్నడూ చూడని మాస్ లుక్, డిఫరెంట్ పాత్రలో బాలకృష్ణని చూపించబోతున్నారు గోపిచంద్. సినిమా టైటిల్‌ను త్వరలో ప్రకటిస్తారు.
ఈ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్ అందరి అంచనాలని రెట్టింపు చేస్తే, తాజాగా విడుదలైన ఈ మాస్ పోస్టర్ తో సినిమాలో ఏ స్థాయిలో హై ఇంటెన్స్ యాక్షన్ ఉంటుందో సూచించింది. ఇప్పటికే 40శాతం చిత్రీకరణ పూర్తయింది. ఇప్పటి వరకు వచ్చిన అవుట్ పుట్ తో టీమ్ చాలా సంతృప్తిగా వుంది. ఈ చిత్రాన్ని ఎక్కడా రాజీపడకుండా నిర్మిస్తున్నారు.
కన్నడ స్టార్ దునియా విజయ్ ఈ సినిమాతో విలన్ గా టాలీవుడ్ కి పరిచయం అవుతున్నారు. వరలక్ష్మి శరత్‌కుమార్ కీలక పాత్రలో కనిపించనున్నారు.నిర్మాతలు నవీన్ యెర్నేని, వై రవిశంకర్ ఈ చిత్రాన్ని భారీగా నిర్మిస్తున్నారు. క్రేజీ కాంబినేషన్‌లో రూపొందుతున్న ఈ చిత్రానికి అత్యున్నత సాంకేతిక నిపుణులు పని చేస్తున్నారు.
క్రాక్, అఖండ చిత్రాలని చార్ట్ బస్టర్ గా నిలిపిన మ్యూజిక్ సెన్సేషన్ థమన్ ఎన్‌బికె107కి సంగీతం అందిస్తున్నారు. రిషి పంజాబీ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. స్టార్ రైటర్ సాయి మాధవ్ బుర్రా డైలాగ్స్ అందించగా, నవీన్ నూలి ఎడిటర్ గా, ఎఎస్ ప్రకాష్ ప్రొడక్షన్ డిజైనర్ గా పని చేస్తున్నారు. చందు రావిపాటి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి ఫైట్ మాస్టర్స్ గా రామ్-లక్ష్మణ్ పని చేస్తున్నారు.
నటీనటులు: నందమూరి బాలకృష్ణ, శృతి హాసన్, దునియా విజయ్, వరలక్ష్మి శరత్ కుమార్, చంద్రిక రవి (స్పెషల్ నంబర్) తదితరులు.
సాంకేతిక విభాగం
కథ, స్క్రీన్‌ప్లే , దర్శకత్వం: గోపీచంద్ మలినేని
నిర్మాతలు: నవీన్ యెర్నేని, వై రవిశంకర్
బ్యానర్: మైత్రీ మూవీ మేకర్స్
సంగీతం: థమన్
డివోపీ: రిషి పంజాబీ
ఎడిటర్: నవీన్ నూలి
ప్రొడక్షన్ డిజైనర్: ఏఎస్ ప్రకాష్
డైలాగ్స్: సాయి మాధవ్ బుర్రా
ఫైట్స్: రామ్-లక్ష్మణ్
సిఈవో: చిరంజీవి (చెర్రీ)
కో-డైరెక్టర్: కుర్రా రంగారావు
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: చందు రావిపాటి
లైన్ ప్రొడ్యూసర్: బాల సుబ్రమణ్యం కెవివి
పబ్లిసిటీ: బాబా సాయి కుమార్
మార్కెటింగ్: ఫస్ట్ షో
పీఆర్వో:వంశీ-శేఖర్