ఎన్టీఆర్‌తో కేసీఆర్‌ అరుదైన ఫొటో.. వైరల్

169
kcr
- Advertisement -

తెలంగాణ సీఎం కేసీఆర్ అరుదైన ఫోటో ఒకటి సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.. శ‌నివారం ఎన్టీఆర్ శ‌త జ‌యంతి సందర్భంగా.. తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున ఎన్టీఆర్‌ను స్మ‌రిస్తూ జయంతి వేడుకలు సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో భాగంగా టీఆర్ఎస్‌కు చెందిన చాలా మంది నేత‌లు ఎన్టీఆర్‌కు నివాళి అర్పిస్తున్నారు. ఈ క్ర‌మంలో ఓ ఫొటో సోష‌ల్ మీడియాలో కనువిందు చేస్తోంది. ఈ ఫోటోల మాసిన గెడ్డంతో ఎన్టీఆర్ కూర్చుని ఉండ‌గా… ఆయ‌న ముందు కాస్తంత వంగుని ఆయ‌న‌ను అభిమానంతో చూస్తూ కేసీఆర్ నిల‌బ‌డ్డారు. కేసీఆర్ యువ‌కుడిగా ఉన్న స‌మ‌యంలో తీసిన ఫొటో ఇది. నిజంగానే ఇది అత్యంత అరుదైన ఫొటోగానే చెప్పాలి. ఈ ఫోటోను టీఆర్ఎస్ నేత ఒకరు ట్విట్ట‌ర్‌లో షేర్‌ చేశారు.

కాగా, తెలంగాణ సీఎం కేసీఆర్ ఇప్పుడు టీఆర్ఎస్ అధినేత‌గా కొన‌సాగుతున్నా.. గతంలో ఆయ‌న టీడీపీ నేతేన‌న్న విష‌యం అంద‌రికీ తెలిసిందే. అప్ప‌టికే సినీ రంగంలో ఎవ‌రికీ అంద‌నంత ఎత్తుకు ఎదిగిన ఎన్టీఆర్‌… టీడీపీ పేరిట రాజ‌కీయ రంగ ప్రవేశం చేసే నాటికి ముందే కేసీఆర్ రాజ‌కీయాల్లోకి వ‌చ్చారు. కాంగ్రెస్ పార్టీ నేత‌గా ఆయ‌న త‌న రాజ‌కీయ ప్ర‌స్థానాన్ని ప్రారంభించినా… టీడీపీలోనే ఆయ‌న‌కు రాజ‌కీయ నేత‌గా గుర్తింపు ద‌క్కింది. టీడీపీ పేరిట పార్టీ పెట్టిన ఎన్టీఆర్ పిలుపునందుకుని ప‌లు రంగాల‌కు చెందిన వారు ఆ పార్టీలో చేరిపోయారు. ఎన్టీఆర్ అంటే అప్ప‌టికే ఎన‌లేని అభిమానాన్ని పెంచుకున్న‌కేసీఆర్ కూడా టీడీపీలో చేరిపోయారు. అంతేకాదు ఎన్టీఆర్‌పై ఉన్న అభిమానంతో కేటీఆర్‌ ఆయన కుమారుడికి తారక రామారావు (కేటీఆర్‌)గా నామకరణం చేశారు. ఎన్టీఆర్‌ అంటే సీఎం కేటీఆర్‌కు అంతులేని అభిమానం.

- Advertisement -