కాంగ్రెస్,బీజేపీలు కార్మికులను నాశనం చేశాయి- ఎర్ర‌బెల్లి

126
Minister Errabelli
- Advertisement -

కేంద్ర ప్రభుత్వం కార్మికులంటే చాలు వాళ్ళను ఇబ్బంది పెడుతుంది. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ వస్తే చాలా ఉద్యోగాలు వచ్చేవి..కాంగ్రెస్, బీజేపీ అవి మనకు దక్కకుండా తొక్కి పడేశాయి-కాంగ్రెస్, బీజేపీ పార్టీలు కార్మికులను నాశనం చేశాయని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు.

శుక్రవారం వరంగల్ – హనుమకొండలో ప్రభుత్వ చీఫ్ విప్, వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ నేతృత్వంలో తారా గార్డెన్స్ లో జరిగిన కార్మికమాసోత్సవ సదస్సులో మంత్రులు మల్లారెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, గెల్లు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

ఈ సంద‌ర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ.. బీజేపీ ప్రైవేటు వ్యవస్థను తీసుకువస్తుంది..అన్ని ప్రైవేటు పరం చేస్తున్నారు, దీని వల్ల వచ్చే రోజుల్లో కార్మికులకు ఉద్యోగాలు రాకుండా పోతాయని అన్నారు.ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ లకు కూడా ఉద్యోగాలు రాకుండా కేంద్రం అన్యాయం చేస్తున్నదని ఆరోపించారు.

వ్యవసాయరంగాన్ని కేంద్ర ప్రభుత్వం నాశనం చేసింది.నల్ల చట్టాలు తెచ్చి రైతులను నడ్డి విరవాలని చూసింది. సీఎం కేసిఆర్ ఆ నల్ల చట్టాలను అడ్డుకున్నారు. రైతులు ఎదురు తిరిగే సరికి తప్పు ఒప్పుకొని మోదీ తోక ముడిచాడని అన్నారు. ప్రభుత్వం కార్మికులకు ఇచ్చే టూ వీలర్లలో వరంగల్, హనుమకొండ జిల్లాలకు పదివేల సైకిల్ మోటార్లను ఇవ్వాలని మంత్రి మల్లారెడ్డికి విజ్ఞప్తి చేస్తున్నాను అన్నారు.

సీఎం కేసీఆర్ కార్మిక పక్షపాతి….కార్మికుల సంక్షేమానికి నిజాయితీగా పని చేస్తున్న సీఎం దేశంలో కేసీఆర్ మాత్రమేనని అన్నారు. కార్మికుల కోసం కేసీఆర్ చేపట్టిన అనేక పథకాలను మంత్రి ఎర్రబెల్లి వివరించారు. కార్మికులు అంతా సీఎం కేసిఆర్ కు అండగా నిలవాలని ఆయ‌న‌ కోరారు.

- Advertisement -