- Advertisement -
బాలీవుడ్లో సంచలనం సృష్టించిన డ్రగ్స్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న షారూక్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్‌కు ఊరట లభించింది. ఆర్యన్ ఖాన్‌కు నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో క్లీన్ చిట్ ఇచ్చింది. ఈ కేసులో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో కోర్టులో చార్జ్ షీట్ దాఖలు చేసింది. అందులో ఆర్యన్ ఖాన్ పేరు పేర్కొనలేదు. ఈ కేసులో ఆర్యన్ ఖాన్‌పై నమోదైన ఆరోపణలను రుజువు చేసేందుకు తగిన సాక్ష్యాధారాలు లేవని శుక్రవారం తెలిపింది.
గత సంవత్సరం అక్టోబరు 2న ముంబైలో ఓ క్రూయిజ్ షిప్‌పై నిర్వహించిన దాడుల్లో డ్రగ్స్ దొరికినట్లు ఆరోపిస్తూ, 14 మందిపై దాదాపు 6,000 పేజీల ఛార్జిషీటును దాఖలు చేసింది. ఈ ఛార్జిషీటులో నిందితుల జాబితాలో ఆర్యన్ ఖాన్ పేరు లేదు. ఆర్యన్ ఖాన్, మోహక్ మినహా మిగిలిన నిందితులందరి వద్ద డ్రగ్స్ ఉన్నాయని ఎన్సీబీ అధికారి సంజయ్ కుమార్ సింగ్ తెలిపారు.
- Advertisement -