యోగా నిజజీవితంలో ఓ భాగం: తమిళి సై

71
tamilisai
- Advertisement -

యోగా నిజ జీవితంలో ఒక భాగం కావాలన్నారు గవర్నర్ తమిళి సై.అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని కౌంట్‌డౌన్‌ పేరుతో హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో యోగా ఉత్సవ్‌ కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా మాట్లాడిన తమిళి సై.. నిత్యం యోగా చేయడం వల్ల యవ్వనంగా ఉంటారని.. అనేక శారీరక రుగ్మతల బారిన పడకుండా ఆరోగ్యంగా ఉంటామని తెలిపారు. ఇస్లాం దేశాలు కూడా యోగాను ఆదరిస్తున్నాయని చెప్పారు. యోగాతో మానసిక ప్రశాంతత లభిస్తుందని వెల్లడించారు.

ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు కిషన్‌ రెడ్డి, సర్బానంద సోనోవాల్‌, బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి సైనా నెహ్వాల్‌, క్రికెటర్‌ మిథాలి రాజ్‌, సినీ నిర్మాత దిల్‌ రాజు, మా అధ్యక్షుడు మంచు విష్ణు పాల్గొన్నారు.

- Advertisement -