12ఏళ్ల బాలుడు తండ్రయ్యాడు..

231
12 year old boy became father
12 year old boy became father
- Advertisement -

ఇటీవల లండన్‌లో పదమూడు సంవత్సరాల బాలుడు తండ్రి అయ్యాడు. అతి పిన్న వయస్సులో తండ్రి పదవిని సొంతం చేసుకున్న ఘనుడని లండన్లోని ఓ పత్రిక ప్రచురించింది. అయితే తాజాగా భారత్‌లో కేరళ రాష్ట్రానికి చెందిన ఓ 12 ఏళ్ల బాలుడు తండ్రయ్యాడు. 16 సంవత్సరాల వయసున్న యువతితో లైంగిక సంబంధం ద్వారా ఓ బిడ్డకు జన్మనివ్వడంతో దేశంలోనే అతి పిన్నవయస్కుడైన తండ్రిగా సదరు బాలుడు రికార్డులకెక్కాడు. కేరళ ఎర్నాకుళంలోని ఓ ఆస్పత్రిలో ఆ యువతి ఆడపిల్లకు జన్మనిచ్చింది. అయితే ఆ బాలుడు, యువతికి సంబంధించిన వివరాలను మాత్రం బయటకు వెల్లడించలేదు. ఆ బాలుడి డీఎన్‌ఏ పుట్టిన బిడ్డకు సరిపోవడంతో అతనే తండ్రిగా వైద్యులు నిర్థారించారు.

తిరువనంతపురం మెడికల్‌ కాలేజ్‌ ఎండోక్రినాలజీ విభాగ అధిపతి డాక్టర్‌ పి.కె. జబ్బార్‌ మాట్లాడుతూ.. ఆ బాలుడికి ‘అకాల యుక్తవయస్సు’ రావడం వల్లే ఇలా జరిగి ఉంటుందని అభిప్రాయపడ్డారు. అయితే ఇదేమీ అసాధారణ పరిస్థితి కాదని, ఇంతవరకూ తన దృష్టికి ఇలాంటి ఘటనలేవీ రాలేదని, ఇదే తొలిసారని ఆయన అన్నారు. మరో పక్క ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసినప్పటికీ… ఇద్దరూ మైనర్లు కావడంతో ఇదో చిక్కుముడిలా తయారైంది.

- Advertisement -