తెలంగాణ వ్యవసాయ విధానాలు భేష్ అన్నారు మంత్రి నిరంజన్ రెడ్డి. ఆదివారం ఉదయం హైదరాబాద్ లోని మంత్రుల నివాస సముదాయంలో నిరంజన్ రెడ్డిని కలిశారు కలిసిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ వ్యవసాయ శాఖా మంత్రి, మాజీ ఎంపీ వడ్డే శోభనాద్రీశ్వర రావు.
ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన…తెలంగాణ ప్రభుత్వ వ్యవసాయ విధానాలు భేష్ అన్నారు. కేసీఆర్ రైతు అనుకూల పథకాలు దేశానికి ఆదర్శం..పంటల వైవిధ్యీకరణ తప్పనిసరి .. వరి సాగు నుండి పప్పు, నూనె గింజల సాగు వైపు మళ్లాలన్నారు. ఆయిల్ పామ్ సాగుకు తెలంగాణ ప్రభుత్వం రైతాంగాన్ని ప్రోత్సహించడం ఆహ్వానించదగ్గ పరిణామం అన్నారు. 1985 – 1989 మధ్యకాలంలో నూనెగింజలు – అపరాల సాంకేతిక మిషన్ పథకం తరహాలో ప్రస్తుతం అపరాలు, నూనె, పప్పుగింజల సాగుకు ప్రోత్సాహం అందించాల్సిన అవసరం ఉందన్నారు. ఇథనాల్ ఉత్పత్తిని ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు.
విదేశీ ఎగుమతులను ప్రోత్సహించేందుకు అవసరమైన వసతులు కల్పించాలని…వ్యవసాయ ఉత్పత్తులకు విలువను జోడించి అధికధర పొందడానికి చిన్న తరహా పరిశ్రమల ఏర్పాటుకు మహిళా రైతు ఉత్పత్తి సంస్థలకు సహకారం అందించాలన్నారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ మద్దతుధరల విషయంలో అవలంబిస్తున్న లోపభూయిస్ట విధానాల మూలంగా రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు. స్వామినాథన్ కమిటీ సిఫార్సుల మేరకు పంట ఉత్పత్తులకు c2 + 50 ఫార్మూలా ప్రకారం కనీస మద్దతుధర లభించేలా చట్టబద్దత కల్పించినపుడే రైతులకు న్యాయం జరుగుతుందన్నారు.