మహబూబ్ నగర్,రంగారెడ్డి,హైదరాబాద్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ బలపర్చిన అభ్యర్ధి కాటేపల్లి జనార్ధన్ రెడ్డి ఘనవిజయం సాధించింది. అంబర్ పేట మున్సిపల్ గ్రౌండ్స్‌లో జరిగిన ఓట్ల లెక్కింపులో మొదటి నుంచి కాటేపల్లి ఆధిక్యతను ప్రదర్శిస్తూ వచ్చారు. మొత్తం 28 టేబుళ్లు ఏర్పాటు చేసి 50 బ్యాలెట్లు చొప్పున 126 కట్టలు కట్టి లెక్కింపు ప్రారంభించారు. మొత్తం 19338 ఓట్లకుగాను నోటాకు 48 ఓట్లు రాగా, 242 ఓట్లు చెల్లలేదు.
మొదటిరౌండ్‌లో జనార్దన్‌రెడ్డికి 5459 ఓట్లు రాగా, ఏవీఎన్ రెడ్డికి 2238, మాణిక్‌రెడ్డికి 2171ఓట్లు పోలయ్యాయి. గెలుపుకోసం మొత్తం ఓట్లలో సగానికిపైగా, అంటే 9670 ఓట్లు ఒకే అభ్యర్థికి పోలైతే విజయం సాధించినట్లు ప్రకటిస్తారు. అయితే మొదటి రౌండ్‌లో ఎవ్వరికీ సగానికిపైగా ఓట్లు రాకపోవడంతో ఎలిమినేషన్ రౌండ్లు ప్రారంభించారు. చివరికి 11వ రౌండ్‌లో కాటేపల్లి విజయానికి అవసరమైన 9670 ఓట్లకు మించి 9734 ఓట్లు సాధించారు. దీనితో ఓట్లలెక్కింపును నిలిపివేసి, ఆయనను విజేతగా ప్రకటించారు.
ఉపాధ్యాయ సమస్యలు పరిష్కరించేందుకు తనవంతు కృషి చేస్తానని ఈ సందర్భంగా కాటేపల్లి జనార్ధన్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వంపై ఉపాధ్యాయులకు వ్యతిరేకత ఉందంటూ కొందరు సాగిస్తున్న ప్రచారానికి తన విజయం తగిన సమాధానం చెప్పిందని అన్నారు. తనను ఉపాధ్యాయులు భారీ మెజారిటీతో గెలిపిచడం చూస్తుంటే ప్రతిపక్షాలు సాగించిన దుష్ప్రచారంలో నిజం లేదని తేలిపోయిందన్నారు. తనకు మద్దతు పలికిన సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్, ఇతర మంత్రులు, ఎమ్మెల్యేలు, తనకు అండగా నిలిచిన 52 ఉపాధ్యాసంఘాలు, ఉపాధ్యాయులు, పార్టీ కార్యకర్తలు అందరికీ ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఉపాధ్యాయులకు సంబంధించి దశాబ్దకాలంగా పెండింగ్‌లో ఉన్న సమస్యల పరిష్కారానికి సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవ తీసుకుని వాటిని పరిష్కరించారని, ఏ ఉద్యోగి, ఉపాధ్యాయుడు రిటైర్ అయినా అదే రోజు అతనికి రిటైర్‌మెంట్ బెనిఫిట్లు అన్నీ అందజేసేలా సీఎం అధికారులను
ఏకైక టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి ఇప్పటికే ఎమ్మెల్సీగా ఉన్న కాటేపల్లి తిరిగి అధికార పార్టీ టీఆర్‌ఎస్ మద్దతుతో పోటీచేశారు. ఆయన అభ్యర్థిత్వానికి ముఖ్యమంత్రి కేసీఆర్ మద్దతు ప్రకటించడంతో హరీశ్ రావు ఇంచార్జీగా హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ ఉపాధ్యాయ నియోజకవర్గంలోని ప్రజాప్రతినిధులు, టీఆర్‌ఎస్ నాయకులు కార్యక్షేత్రంలోకి దిగారు. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగులు, టీచర్ల కోసం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను విస్తృతంగా ప్రచారం చేశారు. బ్యాలెట్ పేపర్లో ఫొటోలు మారడం వల్ల ఒకసారి ఎన్నిక రద్దయినా అందరూ తిరిగి అంతే ఉత్సాహంతో పనిచేశారు.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన కాటేపల్లి జనార్దన్‌రెడ్డి మద్దతుదారులు సంబురాలు జరుపుకున్నారు. గురువారం సిద్దిపేట జిల్లాలో మంత్రి హరీశ్‌రావు నేతృత్వంలో భారీ స్థాయిలో విజయోత్సవ సభను నిర్వహించనున్నారు.