ఆర్.జె.సినిమాస్ పతాకంపై డైనమిక్ లేడీ డైరెక్టర్ జయ బి. దర్శకత్వంలో బి.ఎ.రాజు నిర్మిస్తున్న లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘వైశాఖం’. హరీష్, అవంతిక జంటగా నటించిన ఈ చిత్రానికి డి.జె.వసంత్ సంగీతాన్నందించారు. ఇటీవల విడుదలైన ఈ చిత్రం ఆడియోకు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ఈ నేపథ్యంలో హీరో హరీష్, సంగీత దర్శకుడు డి.జె.వసంత్ హైదరాబాద్‌లోని రేడియో మిర్చిలో ఓ స్పెషల్ ప్రోగ్రామ్ చేశారు.
ఈ సందర్భంగా హీరో హరీష్ మాట్లాడుతూ – ”ఆడియో చాలా పెద్ద హిట్ అయింది. చిత్రంలోని అన్ని పాటలూ ఒక దాన్ని మించి మరొకటి అన్నట్టుగా వున్నాయి. వసంత్‌గారు చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారు. ఈ చిత్రంలోని పాటల్ని అందరూ విని ఎంజాయ్ చేస్తున్నారు” అన్నారు.
సంగీత దర్శకుడు డి.జె.వసంత్ మాట్లాడుతూ – ”ఈ చిత్రంలోని ఐదు పాటలూ చాలా పెద్ద హిట్ అయ్యాయి. ఆడియో చాలా ఎక్స్‌లెంట్‌గా వుందని అన్ని ఏరియాల నుంచి రిపోర్ట్స్ వస్తున్నాయి. నా కెరీర్‌లో ‘వైశాఖం’ ఒక స్పెషల్ మూవీ అని చెప్పొచ్చు. ఆడియో హిట్ అయినట్టుగానే సినిమా కూడా సూపర్‌హిట్ అవుతుంది” అన్నారు.
హరీష్, అవంతిక జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో డైలాగ్ కింగ్ సాయికుమార్ ప్రత్యేక పాత్రలో నటిస్తున్నారు. ఈశ్వరీరావు, రమాప్రభ, పృథ్వీ, కాశీ విశ్వనాథ్, కృష్ణభగవాన్, శ్రీలక్ష్మీ, గుండు సుదర్శన్, అప్పారావు, శేషు, భద్రం, సొంపు, ఫణి, మాధవి, జెన్నీ, జబర్దస్త్ టీమ్ వెంకీ, శ్రీధర్, రాంప్రసాద్, ప్రసాద్, తేజ, శశాంక్, లతీష్, కీర్తి నాయుడు, పరమేశ్వరి, గోవిందరావు, వీరన్న చౌదరి, రాజా బొయిడి, లత సంగరాజు, లావణ్య, మోనిక, చాందిని, ఇషాని కళ్యాణి కామ్రే, షాజహాన్ సుజానే, తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. డి.ఓ.పి.: వాలిశెట్టి వెంకటసుబ్బారావు, సంగీతం: డి.జె.వసంత్, డాన్స్: వి.జె.శేఖర్, ఆర్ట్: మురళి కొండేటి, ఫైట్స్: వెంకట్, రామ్ సుంకర, స్టిల్స్: శ్రీను, కో-డైరెక్టర్: అమరనేని నరేష్, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్: సుబ్బారావు, లైన్ ప్రొడ్యూసర్: బి.శివకుమార్, నిర్మాత: బి.ఎ.రాజు, రచన, ఎడిటింగ్, దర్శకత్వం: జయ బి.