ఐపీఎల్ 2022 సీజన్‌లో భాగంగా శుక్రవారం మరో కీలక మ్యాచ్ జరగనుంది. ఈ పోరులో పంజాబ్ కింగ్స్, బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన బెంగళూరు జట్టు తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో పంజాబ్ జట్టు ఫస్ట్ బ్యాటింగ్‌కు దిగనుంది. ముంబైలోని బ్రాబౌర్న్ స్టేడియం వేదికగా జరగనున్న ఈ మ్యాచ్.. ఇరు జట్లకు కీలకమనే చెప్పాలి. ఇక ఈ మ్యాచ్ కోసం ఆర్సీబీ ఎటువంటి మార్పులు చేయలేదు. అదే సమయంలో పంజాబ్ కింగ్స్ ఈ మ్యాచ్ కోసం ఒక మార్పు చేసింది.
ఇప్పటిదాకా 12 మ్యాచ్‌లు ఆడిన బెంగళూరు జట్టు 7 విజయాలతో 14 పాయింట్లు సాధించి పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో ఉంది. నేటి మ్యాచ్‌లో విజయంతో ఈ జట్టు ప్లే ఆఫ్ అవకాశాలను మరింతమేర మెరుగుపరచుకునే అవకాశం ఉంది. ఇక పంజాబ్ విషయానికి వస్తే.. ఇప్పటిదాకా 11 మ్యాచ్‌లు ఆడిన ఈ జట్టు 5 విజయాలతో 10 పాయింట్లు సాధించి పాయింట్ల పట్టికలో 8వ స్థానంలో ఉంది. ఈ మ్యాచ్‌లో విజయంతో తన ప్లే ఆఫ్ అవకాశాలను ఈ జట్టు సజీవంగా ఉంచుకోగలుగుతంది.
తుది జట్లు..
పంజాబ్ కింగ్స్- జానీ బెయిర్ స్టో, శిఖర్ ధావన్ ,మయాంక్ అగర్వాల్ (కెప్టెన్), భానుక రాజపక్స, లియాం లివింగ్ స్టోన్, జితేశ్ శర్మ, రిశి ధావన్, కగిసో రబడ, రాహుల్ చహర్, హర్ ప్రీత్ బ్రార్, అర్ష్ దీప్ సింగ్
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు-విరాట్ కోహ్లీ, ఫాఫ్ డు ప్లెసిస్ (కెప్టెన్), రజత్ పటిదార్, గ్లెన్ మ్యాక్స్ వెల్, దినేశ్ కార్తీక్, మహిపాల్ లొమ్రోర్, షాబాజ్ అహ్మద్, హసరంగ, హేజల్ వుడ్, మొహమ్మద్ సిరాజ్