సీఎం కేసీఆర్ మానవతావాది- మంత్రి హరీశ్‌

103
harish
- Advertisement -

ముఖ్యమంత్రి కేసీఆర్ మానవతావాది.. మనసున్న మహరాజు అని వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌ రావు కొనియాడారు. గురువారం ఆయన ఉస్మానియా ఆసుపత్రిలో రోగి సహాయకులు కోసం ఏర్పాటు చేసిన మూడు పూటలా భోజన పథకన్ని ప్రారంభించారు. అనంతరం మంత్రి హరీశ్ మీడియాతో మాట్లాడుతూ.. హైద్రాబాద్ లోని 18 ఆసుపత్రులు మూడు పూటలా భోజన కార్యక్రమాన్ని ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందన్నారు.. ముఖ్యమంత్రి కేసీఆర్ మానవతావాది. అధికారంలోకి వచ్చిన తర్వాత కిలోకి ఒక్క రూపాయికే ఇంట్లో ఎంత మంది ఉన్న ఒక్కక్కోరికి 6 కేజీలు ఇవ్వమని, సీలింగ్ ఎత్తివేశారు. గతంలో ఎక్కడ ఎంత మంది ఉన్న 20 కేజీలు ఇచ్చేవారు. ఎస్ సి, ఎస్ టి, బి సి హాస్టల్ లో గతంలో ఆహారం ముక్కి పోయి ఉండేది. ఇప్పుడు సన్న బియ్యంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆహారం పెడుతుందని మంత్రి అన్నారు.

టీఆర్‌ఎస్ ప్రభుత్వం వచ్చాక ఆసరా పించిన్న 2 వేలకు పైగా ఇస్తున్నాం.. వృద్దలు, వితంతువులు ఆత్మ గౌరవంతో ఉండే విధంగా పింఛన్ ఇస్తున్నము. దేశంలో కల్యాణ లక్ష్మితో ఆడపిల్ల పెళ్లికి ఆర్ధిక సహాయం చేస్తున్నా ఏకైక రాష్ట్రం తెలంగాణ అని అన్నారు. కరోన సమయంలో సీఎం కేసీఆర్ గాంధీకి వెళ్ళినప్పుడు పేషెంట్ అటెండెర్స్ బాధ చూసి 3 పూటలా ఆహారం అందించాలని నిర్ణయం తీసుకున్నారు గ్రేటర్ పరిధిలోని ఆసుపత్రులు దాదాపుగా రోజు 20 వెల భోజనం చేస్తారని అంచనా.. ఒక్క భోజనం పైన 21 రూపాయల సబ్సిడీ అమౌంట్ ప్రభుత్వం కడుతుంది. నైట్ షెల్టర్లు కూడా ఏర్పాటు చేస్తున్నాం.. డైట్ ఛార్జలను కూడా పెంచడం జరిగింది. డైట్ ఛార్జ్ లను పెంచడం ద్వారా 43 కోట్ల రూపాయలుకు పైగా భారం పడుతుంది. టెండర్లు కూడా చివరి దశలో ఉన్నాయని మంత్రి గుర్తు చేశారు.

శానిటేషన్ కోసం 338 కోట్ల కెటయించమని, 50 శాతం పెంచుకోవడం జరిగింది,కార్మికులకు సకాలంలో జీతాలు వచ్చే విధముగా చర్యలు తీసుకుంటున్నాము. నగరంలో 2679 కోట్ల రూపాయిలతో 3 సూపర్ స్పెషాలాటి ఆసుపత్రులుకు శంఖుస్థాపన చేశారు. టీమ్స్ కి, నిమ్స్ లో నూతన పడకలు ఏర్పాటుకి త్వరలో నిధులు కేటాయించనున్నామని చేప్పారు. స్టాఫ్ కి ,పేషెంట్ అటెండెర్స్ కి కొత్తగా నిర్మిస్తున్న సూపర్ స్పెషాలాటి ఆసుఫత్రులు మంచి వసతలు కూడా కల్పిస్తున్నాం..అల్వాల్ ఎమ్ సి హెచ్ కి హాస్పటల్ ని కూడా ఏర్పాటు చేసాం. అవయవ మార్పాడిని కూడా ప్రభుత్వ అస్పత్రులు చేస్తున్నామని..ఆరోగ్య శ్రీ కింద అవయవ మార్పాడీలు చేస్తున్నామని మంత్రి తెలిపారు.

అన్ని అసుపత్రులలో నేషనల్ గైడ్ లైన్స్ కింద ఫైర్ సేఫ్టీకి చర్యలు తీసుకుంటున్నాం,నిధులు కెటయించడం జరిగింది. ఉస్మానియా ఆసుపత్రిలో అభివృద్ధి పనులు చేస్తున్నాం. ఈ రోజు 45 ఐసియు పడకలు ప్రారంభించుకున్నము. ఆర్థోపెటిక్‌ , ఐసీయూ, ఫార్మసీ,ఓపీ రిజిస్ట్రేషన్‌ బ్లాక్‌, మైనర్ ఓటిని ప్రారంభించుకోవడం జరిగింది. ఉస్మానియా మార్చురీ అత్యాధునికంగా తీర్చదిద్దబోతున్నాం, ఆధునిక మార్చురీ అందుబాటులోకి తీసుకొని రానున్నామన్నారు. ఆర్థోపెడిక్‌ కాంప్లెక్స్‌ కోసం మరిన్ని నిధులు కేటాయించాం. ఉస్మానియా హెరిటేజ్ భవనానికి ఇబ్బంది లేకుండా కొత్త భవనం నిర్మాణాలు పైన కమిటి రిపోర్ట్ ఇచ్చింది,ఫైనల్ రిపోర్ట్ రావాలి, రిపోర్ట్ వచ్చిన తరువాత ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకుంటారు. సీఎం కేసీఆర్ ముందుగా విజిట్ చేసింది ఉస్మానియా ఆసుపత్రిని,జీఓ కూడా ఇచ్చారు. అప్పుడు కొంతమంది కోర్ట్ కి పోవడం జరిగిందని మంత్రి హరీశ్‌ గుర్తు చేశారు.

- Advertisement -