చైనాలో కరోనాను అదుపులోకి తెచ్చేందుకు ఆ దేశం అమలు చేస్తున్న కఠిన ఆంక్షలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయితే ఆంక్షలు అమలు చేయకపోతే కేసులు, మరణాల సంఖ్య పెరిగే అవకాశం ఉండటంతో ఆంక్షలు అమలుచేయక తప్పనిసరి పరిస్థితి నెలకొంది. అయితే ప్రభుత్వం విధిస్తున్న ఆంక్షలతో జనజీవనం పూర్తిగా స్తంభించి పోయింది.
ఇక ఓ సర్వేలో ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. దీర్ఘకాలిక వ్యూహాలతో ఆంక్షలు అమలు చేయకపోతే కేసుల సంఖ్య పెరిగి 16 లక్షల మరణాలు నమోదవుతాయని అంచనా వేశారు. వ్యాక్సిన్లలోని రోగ నిరోధక స్ధాయిలు ఒమిక్రాన్‌ను తట్టుకోలేవని..ఇలాంటి సమయంలో మాస్ టెస్టింగ్‌లు, కఠినమైన లాక్ డౌన్ నిబంధనలు అమలు చేయకపోతే చైనాలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉందని అంచనా వేసింది.
ఆంక్షలు అమలుచేయకపోతే 112.2 మిలియన్ల మందికి వైరస్ సోకే అవకాశం ఉన్నట్లు ఆ నివేదిక అంచనా వేసింది. 1.6 మిలియన్ మంది మృత్యువాత పడే అవకాశం ఉందని తెలిపింది.