‘ఎఫ్3’ చూసి ఎంజాయ్ చేయండి- వెంకీ

123
venkatesh
- Advertisement -

విక్టరీ వెంకటేష్ , మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, బ్లాక్ బస్టర్ దర్శకుడు అనిల్ రావిపూడి ఫన్ ఫ్రాంచైజీ ఎఫ్3 తో థియేటర్లలో నవ్వులు పంచడానికి సమ్మర్ సోగ్గాళ్ళుగా రాబోతున్నారు. ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఈ సినిమాని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు సమర్పణలో శిరీష్ నిర్మిస్తున్నారు. ఈ రోజు ఎఫ్3 థియేట్రికల్ ట్రైలర్‌ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఎఫ్3 సమ్మర్ బిగ్గెస్ట్ ఎంటర్ టైనర్ కాబోతుందని థియేట్రికల్ ట్రైలర్‌ చూస్తే అర్ధమౌతుంది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా నవ్వులు పంచడానికి మే 27న ఎఫ్3 థియేటర్లలోకి వస్తుంది. ఈ నేప‌థ్యంలో హైద‌రాబాద్‌లోని ఏఎంబీ సినిమాస్‌లో మంగ‌ళ‌వారం సాయంత్రం ప్రెస్‌ మీట్ ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా హీరో వెంకటేష్‌ మాట్లాడుతూ..‘ట్రైల‌ర్‌కు అద్బుతమైన స్పంద‌న వస్తోంది. ఎఫ్ 2 కంటే ఎక్కువ వినోదం ఈ సినిమా అందిస్తుంది. కోవిడ్ త‌ర్వాత నా రెండు సినిమాలు ఓటీటీలో రిలీజ‌య్యాయి. ఎఫ్3 సినిమాతో మ‌ళ్లీ థియేట‌ర్ల‌లో మిమ్మ‌ల్ని క‌లుస్తుండ‌టం ఆనందంగా ఉంది. దిల్ రాజు, శిరీష్, అనిల్ రావిపూడి వండ‌ర్ ఫుల్ స్క్రిప్ట్‌తో వ‌చ్చారు. మొత్తం కుటుంబ‌స‌భ్యుల‌తో క‌లిసి ఎంజాయ్ చేసేలా సాగుతుంది ఎఫ్ 3. మే 27న థియేట‌ర్ల‌లోకి వ‌స్తుంది. మీరంతా మీ ఫ్యామిలీ మెంబ‌ర్స్ తో క‌లిసి సినిమా చూసి ఎంజాయ్ చేయాల‌ని కోరుకుంటున్నాన‌ని’ అన్నాడు వెంకీ.

- Advertisement -