39 రోజుల్లో షూటింగ్ పూర్తి…

186
Indraganti's ami thumi Shooting Complete
- Advertisement -

దర్శకుడిగా “గ్రహణం”తో కెరీర్‌ను ప్రారంభించిన మోహనకృష్ణ ఇంద్రగంటి ‘అష్టా చమ్మా’ .. ‘జెంటిల్ మన్’ సినిమాలతో మంచి పేరు తెచ్చుకున్నారు. కథ .. కథనాలకి  ప్రాధాన్యతనిచ్చే ఇంద్రగంటి త్వరలో నాగచైతన్యతో  సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆయన దర్శకత్వంలో మల్టీస్టారర్ సినిమా తెరకెక్కుతోంది. అవసరాల శ్రీనివాస్ .. అడివి శేష్ .. వెన్నెల కిషోర్ ప్రధాన పాత్రలుగా ఆయన ‘అమీ తుమీ’ అనే సినిమాను తెరకెక్కించాడు.

తన సినిమాల్లో ఎక్కువగా తెలుగు నటీనటులు, టెక్నీషియన్లు ఉండేలా జాగ్రత్తపడే మోహనకృష్ణ ఈ సినిమాలోనూ అదే ఫాలో అయ్యారు. మాయాబజార్,అష్టాచెమ్మా,గోల్కొండ హైస్కూల్, జెంటిల్ మన్ చిత్రాల్లో తెలుగు ఆర్టిస్ట్,టెక్నీషియన్లు ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారు.

ఇక ఈ సినిమాను ఆయన కేవలం 31 రోజుల్లో తెరకెక్కించారు. తాను అత్యంత వేగంగా రూపొందించిన రెండవ సినిమా ఇదంటూ మోహనకృష్ణ ఇంద్రగంటి చెప్పాడు. అందుకు సహకరించిన టీమ్ కి ఆయన కృతజ్ఞతలు తెలియజేశాడు. మణిశర్మ సంగీతాన్ని అందించిన ఈ సినిమాలో, కథానాయికలుగా ఈషా .. అదితి అలరించనున్నారు.

ఈ చిత్రంలో తనికెళ్లభరణి, అనంత్, మధుమణి, కేదార్ శంకర్, వేణుగోపాల్, శ్యామల, తనికెళ్ళ భార్గవ్, తడివేలు తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి మేకప్ చీఫ్: సి.హెచ్.దుర్గాబాబు, కాస్ట్యూమ్ డిజైనర్: ఎన్.మనోజ్ కుమార్, ప్రొడక్షన్ కంట్రోలర్: మోహన్ పరుచూరి, ప్రొడక్షన్ అడ్వైజర్: డి.యోగానంద్, కో-డైరెక్టర్: కోటా సురేష్ కుమార్, ప్రొడక్షన్ డిజైనర్: ఎస్.రవీందర్, ఎడిటర్: మార్తాండ్ కె.వెంకటేష్, సినిమాటోగ్రఫీ: పి.జి.విందా, మ్యూజిక్: మణిశర్మ, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: వినయ్, ప్రొడ్యూసర్: కె.సి.నరసింహారావు, రచన-దర్శకత్వం: మోహనకృష్ణ ఇంద్రగంటి.

- Advertisement -