గీతాగోవిందం ఫేమ్ పరుశరామ్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా నటించిన చిత్రం సర్కారు వారి పాట. మే 12న భారీ అంచనాల మధ్య సినిమా ప్రేక్షకుల ముందుకురానుండగా మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించాయి. మహేశ్ సరసన కీర్తి సరేశ్ హీరోయిన్‌గా నటించగా ఇప్పటికే విడుదలైన పాటలు,టీజర్‌లకు మంచి రెస్పాన్స్ వచ్చింది.
ఇక సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా పలు ఛానళ్లకు ఇంటర్వ్యూ ఇస్తున్న మహేశ్ బాబు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ఈ సందర్భంగా బాలీవుడ్‌లోకి ఎప్పుడు వెళ్తారనే ప్రశ్న రాగా ప్రస్తుతానికి టాలీవుడ్ లో కంఫర్ట్ గా ఉన్నానన్నారు . బాలీవుడ్ నుంచి చాలా ఆఫర్లు వస్తున్నాయని, కానీ తనను బాలీవుడ్ ప్రొడ్యూసర్లు భరించలేరన్నారు.
తెలుగులోనే మరిన్ని సినిమాలు తీస్తానని చెప్పారు. టాలీవుడ్ తనకు మంచి గుర్తింపు, గౌరవం, స్టార్ డమ్ తీసుకొచ్చిందని…తెలుగు ఇండస్ట్రీని విడిచి ఇతర ఇండస్ట్రీలకు పని చేయాలనే ఆలోచన తనకు లేదన్నారు.