ఏపీలో ఎన్నికలకు ఇంకా రెండేళ్లు సమయం ఉండగా అప్పుడే పొత్తు రాజకీయాలు హాట్ టాపిక్‌గా మారాయి. వైసీపీని ఓడించడమే తమ ముందు ఉన్న లక్ష్యమని టీడీపీ అధినేత చంద్రబాబు,జనసేన చీఫ్ పవన్ ప్రకటించిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో ఓ న్యూస్ ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. 2024లో జరిగే ఎన్నికల్లో విపక్ష కూటమి సీఎం అభ్యర్థిగా పవన్‌ని ప్రకటిస్తారని ప్రచారం జరుగుతోంది. టీడీపీతో జనసేన జతకట్టే అవకాశాలున్నాయని…ఇదే జరిగితే పవన్‌ని సీఎం అభ్యర్థిగా ప్రకటించడం ఖాయమని జనసైనికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
2014లో టీడీపీ, బీజేపీ కోసం వర్క్ చేసిన పవన్ కల్యాణ్… 2019లో టీడీపీ, బీజేపీకి దూరంగా రాజకీయాలు చేశారు. ఎన్నికల తర్వాత బీజేపీతో కలిసి రాజకీయం చేస్తూ వచ్చారు. అయితే క్రమంగా బీజేపీ, జనసేన మధ్య దూరం పెరుగుతోంది. దీంతో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా ఉండేందుకు టీడీపీ – జనసేన కలిసి పనిచేయడం ద్వారా ఇద్దరి లాభం చేకూరుతుందని ఇరు పార్టీల నేతలు భావిస్తున్నారు. ఇలాంటి సందర్భంగా సీఎం అభ్యర్థిగా పవన్‌ని ప్రకటిస్తారనే వార్త వైరల్‌గా మారింది.