ఆ ప్రచారం అంతా అబద్దం: అల్లరి నరేష్

231
naresh
- Advertisement -

అల్లరితో ఇండస్ట్రీకి పరిచయమైన నటుడు అల్లరి నరేష్. వైవిధ్యమైన సినిమాలతో ఇండస్ట్రీలో 20 ఏళ్లు పూర్తి చేసుకున్న నరేష్…తాజాగా మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర విషయాలు వెల్లడించారు. నాన్న వల్లే సినిమాలకి వచ్చానని, ఆయన్ని ఎంతో మిస్ అవుతున్నానని చెప్పారు.

అయితే నాన్న లేకపోవడం వల్లే ఫ్లాప్స్ వస్తున్నాయనడంలో నిజం లేదన్నారు. గమ్యం సినిమా నేనే ఒప్పుకున్నాను అది మంచి పేరు తీసుకువచ్చిందన్నారు. నాన్న చనిపోయిన తర్వాత సుడిగాడు, అహ నా పెళ్లంట సినిమాలు హిట్‌ అయ్యాయి. ఇక నాంది సినిమా హిట్ అయినప్పుడు నాన్న ఉంటే బాగుండని అనుకున్నానని చెప్పారు.

మహర్షి చేసిన తర్వాత ఓ నిర్మాత నన్ను ఇక నువ్వు క్యారెక్టర్‌ ఆర్టిస్టుగానే వెళ్లిపోవచ్చు అన్నారు కానీ నాంది తర్వాత ఆయనే ఫోన్ చేసి ప్రశంసలు గుప్పించారన్నారు. ఎవరి కెరీర్ ఎలా ముగుస్తుందో ఎవరూ డిసైడ్ చేయలేరన్నారు.

- Advertisement -