- Advertisement -
కాంగ్రెస్ వరంగల్ డిక్లరేషన్ సభపై తనదైన శైలీలో స్పందించారు ఎమ్మెల్యే బాల్క సుమన్. తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడిన సుమన్…చంద్రబాబుకు ఏజెంట్‌గా ఉన్న రేవంత్ రెడ్డి రైతుల పక్షాన ఉంటాడట అని ఎద్దేవా చేశారు. స్టేజి మీద ఉన్నోడు ఒక్కడు కూడా తెలంగాణ ఉద్యమంలో లేడన్నారు.
కొత్త థియేటర్లో పాత సినిమా లాగా కాంగ్రెస్ సభ ఉందని ఎద్దేవా చేశారు. చావు నోట్లో తలపెట్టి, రాష్ట్రాన్ని సాధించుకున్నామని…. బైండోవర్ కేసులు పెట్టి నిర్బంధించారని పేర్కొన్నారు.
బండి సంజయ్‌పై తెలంగాణ ఉద్యమంలో ఒక్క కేసైన ఉందా? అని ప్రశ్నించారు. ధర్మపురి అరవింద్ ఎవడికి తెలుసని అన్నారు. నిజానికి కాంగ్రెస్ సభ.. మానసిక సంఘర్షణ సభ లాగా ఉందన్నారు.
- Advertisement -