- Advertisement -
లేడీ సూపర్ స్టార్ నయనతార – విఘ్నేశ్ త్వరలో ఒకటి కాబోతున్నారు. ఇప్పటికే ఎంగేజ్మెంట్ కూడా అయిపోగా ఈ జంట పెళ్లి పీటలెప్పుడు ఎక్కుతుందా అని సౌత్ ఇండియా ప్రేక్షకులంతా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం పీకల్లోతు ప్రేమలో ఉన్న ఈ జంట తమ ప్రేమాయణానికి ముగింపు పలికి, దాంపత్య బంధానికి స్వాగతం పలకాలని డిసైడ్ అయ్యారు.
ఈ మేరకు ఒక ముహూర్తం కూడా ఫిక్స్ చేసుకున్నట్లు తెలుస్తుంది. ఈ ఏడాది జూన్ 9న తిరుమలలో పెళ్లి చేసుకోబోతున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే ముహూర్తం ఖరారు కావడంతో ఇక వివాహ వేదిక ఎంపిక, ఇతర ఏర్పాట్ల కోసం ఈ జంట శనివారం తిరుమల పర్యటనకి వచ్చారు.
వీఐపీ బ్రేక్ దర్శనంలో తిరుమల శ్రీవారిని దర్శించుకుని.. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేద ఆశీర్వచనం, శ్రీవారి తీర్థప్రసాదాలు తీసుకున్నారు.
- Advertisement -