కైటెక్స్‌ టెక్స్‌టైల్ పరిశ్రమకు భూమిపూజ..

63
minister
- Advertisement -

ఉమ్మడి వరంగల్‌ జిల్లా గీసుకొండ మండలం హవేలీలోని కాకతీయ మెగా టైక్స్‌టైల్‌ పార్కులో ఏర్పాటు చేస్తున్న కైటెక్స్‌ టెక్స్‌టైల్‌ పరిశ్రమకు భూమిపూజ చేశారు మంత్రి కేటీఆర్. వరంగల్ పర్యటనలో భాగంగా రూ.1200 కోట్లు పెట్టుబడితో ఏర్పాటుచేయనున్న కైటెక్స్‌కు భూమిపూజ చేశారు.

ఈ సంస్థ ద్వారా 11,100 మందికి ఉపాధి అవకాశాలు కల్పించనున్నారు. పరిశ్రమ ఏర్పాటుకు ప్రభుత్వం 187 ఎకరాల భూమిని కేటాయించింది. అనంతరం మిషన్‌ భగీరథ ట్యాంక్‌ పనులకు శంకుస్థాపన చేశారు.

- Advertisement -