- Advertisement -
మాస్ కా దాస్ విశ్వక్ సేన్ ‘అల్లం అర్జున్’గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన తాజా చిత్రం ‘అశోకవనంలో అర్జున కల్యాణం’. విశ్వక్ సేన్ సరసన రుక్సార్ దిల్లాన్ హీరోయిన్గా అలరించిన ఈ మూవీకి విద్యాసాగర్ చింతా దర్శకత్వం వహించారు. ఈ సినిమా నుంచి వచ్చిన పోస్టర్లు, టీజర్, ట్రైలర్ విభిన్నంగా ఆకట్టుకున్నాయి. అలాగే సినిమా ప్రమోషన్లో భాగంగా చేసిన చర్యలు పలు విమర్శలను కూడా మూటగట్టుకోగా వాటన్నింటిని పటాపంచలు చేస్తూ పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతోంది.
విడుదలైన ప్రతిచోటా మంచి వసూళ్లాను రాబడుతోంది. ముఖ్యంగా విశ్వక్ సేన్ నటన సినిమాకు ప్లస్‌గా మారింది. ఈ నేపథ్యంలో నిర్మాత అల్లు అరవింద్..అశోకవనంలో అర్జున కల్యాణం చిత్ర యూనిట్‌కి సక్సెస్ విందు ఇచ్చారు. ఇందుకు సంబంధించిన ఫోటోను షేర్ చేస్తూ సంతోషాన్ని వ్యక్తం చేశారు విశ్వక్ సేన్.
- Advertisement -