వాట్సాప్‌…మరో అద్భుత ఫీచర్‌!

89
whatsapp
- Advertisement -

ప్రపంచవ్యాప్తంగా అత్యధిక మంది స్మార్ట్‌ఫోన్ యూజర్లు వాడుతున్న ఇన్‌స్టంట్ మెసెంజర్ యాప్‌ వాట్సప్. ఎన్నో ఇన్‌స్టంట్ మెసెంజర్ యాప్‌లు అందుబాటులోకి వచ్చినా.. వాట్సప్ ఆకట్టుకున్నంతగా ఆకర్షించలేకపోయాయి. ఎప్పటికప్పుడు సరికొత్త పీచర్స్‌తో వినియోగదారులకు దగ్గరవుతున్న వాట్సాప్ అదిరే ఫీచర్స్‌తో ముందుకురాబోతుంది.

తాజాగా వాట్సాప్ తీసుకొస్తున్న ఫీచర్ సహాయంతో గ్రూప్ అడ్మిన్లుగా ఉన్న వ్యక్తులు గ్రూప్ సభ్యులు షేర్ చేసే మెసేజ్‌లను సులువుగా తొలగించవచ్చు. గ్రూప్‌లో ఎవరైనా తప్పుడు సమాచారాన్ని షేర్ చేస్తే గ్రూప్ అడ్మిన్ సదరు మెసేజ్‌ను డిలీట్ చేయవచ్చు. దీంతో గ్రూప్ సభ్యులకు అడ్మిన్ తమ మెసేజ్‌ను డిలీట్ చేసినట్లు చాట్ స్క్రీన్‌పై కనిపించనుంది. ప్రస్తుతం టెస్టింగ్ దశలో ఉండగా త్వరలో అందుబాటులోకి రానుంది ఈ ఫీచర్.

ఇక త్వరలో రియాక్షన్స్ ఫీచ‌ర్‌ను యూజ‌ర్లకు అందుబాటులోకి తేనుంది వాట్సాప్‌. తొలుత యూజ‌ర్లు రియాక్షన్ మెసేజ్ పంప‌డానికి ఆరు ఏమోజీలు పొందొచ్చు. లైక్‌, ల‌వ్‌, లాప్‌, స‌ర్‌ప్రైజ్‌, శాడ్‌, థ్యాంక్స్ ఎమోజీలు ఈ జాబితాలో ఉన్నాయి.

- Advertisement -